Monday, May 6, 2024

నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్.. 2.65 టన్నుల నకిలీ విత్తనాలు సీజ్

spot_img

హైదరాబాద్: నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న ముఠాను సైబరబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2.65 టన్నుల నకిలీ విత్తనాలు సీజ్ చేశారు. సదాశివా రెడ్డి, తాయప్ప, రాంచందర్, సురేష్ ముఠా సభ్యులతో పాటు ఘట్టమనేని వెంకట రమణ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నకిలీ విత్తనాలు అరికట్టాలని దృఢ నిశ్చయముతో వుందన్నారు. మొత్తం 6 గురిని అరెస్ట్ చేసి 3 కేసులు నమోదు చేశాము. బాచుపల్లి, బాలనగర్, షాబాద్ పరిధిలో నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించాము. 85 లక్ష ల విలువ చేసే నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నాం. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ల అగ్రికల్చర్ అధికారులు మరియు సైబరాబాద్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ చేపట్టారని పేర్కొన్నారు.

ఫేక్ BG-3/HT అనే సీడ్స్ అమ్ముతున్నారు. బాచుపల్లి, బాలనగర్ ప్రాంతాల్లో నకిలీ సీడ్స్ అమ్ముతున్న ప్రధాన సూత్రదారి శివారెడ్డి… కర్ణాటక కు చెందిన ముఠా. బిటీ కాటన్ సీడ్స్ కు డిమాండ్ ఉందని బాలానగర్ లో రైతులకు అమ్మడానికి ప్రయత్నం చేసిన శివారెడ్డి. 1.4 టన్స్ బిటీ సీడ్స్ సీజ్ చేసామన్నారు.

షాబాద్ లో మరో కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశాం. బొలెరో వాహనంలో 25 బ్యాగ్స్ లో సరఫరా చేస్తున్న1.250 కేజీల విత్తనాలను గుర్తించి సీజ్ చేసాము. దౌల్తాబాద్ కు చెందిన వ్యక్తి గట్టమానేని వెంకట్ రమణ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు సీజ్ చేయడం మొదటి సారి. రైతులను రక్షణ ఇవ్వడం మా బాధ్యత. ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని, నకిలీ విత్తనాలు అమ్మడానికి ప్రయత్నం చేసిన వారిమీద కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.

బిల్ తీసుకొని సీడ్స్ కొనాలి: వ్యవసాయ అధికారి గీతా

తక్కువ ధరకు విత్తనాలు ఇస్తాం అని నకిలీ విత్తనాలు రైతులకు అమ్ముతున్నారు. రైతులు విత్తనాలు కొనేటప్పుడు ప్యాకెట్ పైన వివరాలన్నీ చూసుకోవాలి. ప్రభుత్వం నిర్దారించిన ధర కన్నా తక్కువకే విత్తనాలు ఇస్తామని ఆశచూపితే… మోసపోవద్దు. లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరే… బిల్ తీసుకొని సీడ్స్ కొనాలి. ఎక్స్పైరీ అయిన విత్తనాలు కలర్ వేసి రైతులకు అమ్ముతున్నారని పేర్కొన్నారు.

Latest News

More Articles