Saturday, May 4, 2024

కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు..షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు..!!

spot_img

హైదరాబాద్‌: తెలంగాణలో శాసనసభ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం రానుంది.. అక్టోబర్‌ 3 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ  సంసిద్ధతను సమీక్షించడంతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో తొలిరోజు ఈసీ బృందం సమావేశం కానుంది.

Also Read.. కేసీఆర్ డిమాండ్ కు తలొగ్గిన కేంద్రం..ఈనెల 20న మహిళ రిజర్వేషన్ బిల్లు..!!

అదేరోజు ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, రవాణా, తదితర నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో సమావేశమై.. డబ్బు, మద్యం, ఉచిత కానుకల ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది.  ఇక రెండో రోజు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమావేశం కానున్నది. మూడో రోజు రాష్ట్ర సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తారు. చివరిగా ఓటర్లకు అవగాహనా కార్యక్రమాలపైనా సమీక్ష నిర్వహిస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.

Latest News

More Articles