Tuesday, May 7, 2024

తెలంగాణపై మరోసారి విషం కక్కిన మోదీ.. ఘాటుగా స్పందించిన కేటీఆర్!

spot_img

హైదరాబాద్: తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విషం కక్కారు. పాత పార్లమెంట్ లో  చివరిసారిగా మాట్లాడిన ఆయన.. మరోసారి తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించారు. ప్రధాని వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం మండిపడుతోంది. మంత్రి కేటీఆర్ సైతం ట్విటర్(ఎక్స్) వేదికగా మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ తెలంగాణ విరోధి అంటూ స్పందించారు. తెలంగాణ మీద పదే..పదే అదే అక్కసు ఎందుకు ప్రధాని..? అని నిలదీశారు. అమృతకాల సమావేశాలని పేరుపెట్టి తెలంగాణపై విషం చిమ్మడం ఏం సంస్కారమా? అని ప్రశ్నించారు.

Also Read.. కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు..షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు..!!

పద్నాలుగేండ్లు పోరాడి..దేశాన్ని ఒప్పించి మెప్పించి సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం మీకు..? అని మోడీపై కేటీఆర్ ధ్వజమెత్తారు.  మూటలు ఎట్లాగూ మా రాష్ట్రానికి ఇవ్వరు కనీసం..మాటల్లోనైనా మర్యాద చూపించాలని కోరారు. కోటి ఆశలు..ఆకాంక్షలతో  పురుడుపోసుకొన్న కొత్త రాష్ట్రానికి సహకరించక పోగా..ఆదినుంచి కక్షను పెంచుకొని..వివక్షనే చూపిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read.. సినీ నటుడు నాగార్జున సోదరి నాగసుశీలపై పోలీస్ కేసు నమోదు

కృష్ణాలో నీటి వాటాలు తేల్చకుండా పదేండ్లుగా నాన్చుతూ దక్షిణ తెలంగాణ రైతుల్ని దగాచేస్తున్న మీ పగను ఎట్లా  అర్థంచేసుకోవాలి అని కేటీఆర్ ప్రశ్నించారు. కాజీపేట కోచ్‌ ఫాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయి, 157 మెడికల్ కాలేజీల్లో ..ఒక్కటి ఇవ్వకుండా గుండుసున్నా చేసారంటే ..మీకు తెలంగాణపై ఎంత కోపమో తెలుస్తుంది కదా అని పేర్కొన్నారు.  అడుగడుగునా దగా..ప్రశ్నిస్తే పగ.. జుమ్లా..హమ్లా డబుల్ ఇంజన్‌ సర్కారు మీది అంటూ దుయ్యబట్టారు.

Also Read.. బీజేపీలో భగ్గుమన్న అంతర్గత కుమ్ములాటలు..!!

ఈడీ..ఐటీ..సీబీఐలను మీ ఎన్డీయే కూటమిలో చేర్చుకొని ..ప్రతిపక్షాలపై ఉసిగొల్పి ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా పెట్టుకున్నమీకు..పొద్దున లేచి ప్రజాస్వామ్య సుద్దులు చెప్పడం ..విచిత్రం.. అంటూ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్‌ నినాదంతో ఊదరగొట్టే మీకు.. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావు..డిపాజిట్లు పోగొట్టుకోవడంలో మీరు మళ్లీ సెంచరీ కొట్టడం పక్కా.. అంటూ స్పష్టం చేశారు.

Also Read.. కేసీఆర్ డిమాండ్ కు తలొగ్గిన కేంద్రం..ఈనెల 20న మహిళ రిజర్వేషన్ బిల్లు..!!

అడ్డగోలుగా విభజన చేశారని ఒకసారి.. తల్లిని చంపి బిడ్డను బతికించారని మరోసారి.. తెలంగాణలో సంబరాలు జరగనే లేదని ఇంకోసారి..ఇలా ఎన్నిసార్లు పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తారు. మా దశాబ్దాల కల నెరవేరిన నాడు… అంబరాన్ని అంటిన తెలంగాణ సంబరాలు.. అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఆలంపూర్ దాకా.. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఉత్సవాలు కనిపించలేదా ? అని నిలదీశారు. నాటి ఉత్సవం నుంచి.. నేటి దశాబ్ది ఉత్సవం వరకూ ప్రతి తెలంగాణ పుట్టిన రోజు… మా అందరికీ పండుగరోజు అని తెలిపారు. గాంధేయ మార్గంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో రక్తపాతం జరిగిందనడం ఆత్మగౌరవ పోరాటాన్ని పార్లమెంట్ సాక్షిగా అవమానించడమేనని అన్నారు.

Latest News

More Articles