Sunday, May 19, 2024

ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీల జాబితా విడుదల

spot_img

ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. కువైటీ దినార్‌ మరోసారి తొలి స్థానంలో నిలిచింది. ఈ ఒక్క దినార్‌ విలువ రూ.270.23(3.25 డాలర్లు) కు సమానం. బహ్రెయినీ దినార్‌ రూ.220.4 (2.65 డాలర్లు)తో రెండో స్థానంలో ఉంది. భారత కరెన్సీ రూపాయి (ఒక డాలర్‌-రూ.82.9) ఈ జాబితాలో 15వ స్థానంలో ఉంది. 2024 జనవరి 10 నాటికి ఉన్న ఆయా దేశాల కరెన్సీ విలువల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేసినట్లు ఫోర్బ్స్‌ ప్రకటించింది.

Also Read.. ఈ విషయం తెలుస్తే రెస్టారెంట్లలో తినాలంటే జంకుతారు..!!

ఈ జాబితాలో పదో స్థానంలో ఉన్న అమెరికా డాలర్‌ ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యానికి విస్తృతంగా వినియోగిస్తున్న కరెన్సీ గా తెలిపింది. ఇది ప్రాథమిక కరెన్సీ రిజర్వ్‌గానూ ఉందని పేర్కొంది. ప్రపంచంలో అత్యంత స్థిరమైన కరెన్సీగా స్విస్‌ ఫ్రాంక్‌ ఉందని ఫోర్బ్స్‌ తెలిపింది.

Also Read.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన విమానం. వైరల్ వీడియో

తొలి 10 కరెన్సీలివే.. కువైటీ దినార్‌ (రూ.270.23;  3.25 డాలర్లు), బహ్రెయినీ దినార్‌ (రూ.220.4;  2.65 డాలర్లు), ఒమన్‌ రియాల్‌ (రూ.215.84;  2.60 డాలర్లు), జోర్డాన్‌ దినార్‌ (రూ.117.10; 1.141 డాలర్లు), జిబ్రాల్టర్‌ పౌండ్‌ (రూ.105.52; 1.27 డాలర్లు), బ్రిటిష్‌ పౌండ్‌ (రూ.105.54; 1.27 డాలర్లు), కేమన్‌ దీవుల డాలర్‌ (రూ.99.76; 1.20 డాలర్లు), స్విస్‌ ఫ్రాంక్‌ (రూ.97.54; 1.17 డాలర్లు), యూరో (రూ.90.80; 1.09 డాలర్లు), డాలర్ (రూ.82.9).

Latest News

More Articles