Monday, May 6, 2024

రాత్రికి రాత్రి సీన్ రివర్స్.. అద్దంకికి కాంగ్రెస్ భారీ షాక్

spot_img

తుంగతుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్‌కి కాంగ్రెస్ మరో భారీ షాక్ ఇచ్చింది. ప్యారాచూట్ నేతలకే పార్టీలో ప్రాధాన్యత, కాంగ్రెస్ ని నమ్ముకున్నోల్లకు భంగపాటు కలుగుతుందని సగటు హస్తం కార్యకర్తలు బావిస్తున్నట్టే మళ్ళీ అద్దంకిని అడ్డంగా హైకమాండ్ ముంచేసిందని విమర్శలు వస్తున్నాయి.

తుంగతుర్తి టికెట్ అప్పట్లో అద్దంకి దయాకర్‌కి దక్కకపోవడంతో అందరు ఈసారి ఎమ్మెల్సీ టికెట్ పక్క అని అనుకున్నారు. దీనికి తగ్గట్లే గత కొద్దీ రోజులుగా మీడియాలో భారీ ప్రచారమే నడించింది. నిన్న అయితే ఎమ్మెల్సీ టికెట్ వచ్చేసిందని.. హైకమాండ్ ఫోన్ కూడా చేసిందని.. అందరు అద్దంకి దయాకర్‌కి కృతజ్ఞతలు సైతం చెప్పారు. అయితే రాత్రికి రాత్రి సీన్ రివర్స్ అయిపోయింది. అద్దంకి దయాకర్‌ని అడ్డంగా ముంచేస్తూ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్.

ఈ మేరకు హైకమాండ్ బల్మూరి వెంకట్, బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌ కు ఎమ్మెల్సీ టికెట్స్ ఇచ్చినట్టు ఫోన్లు కూడా చేసి సమాచారం అందించింది. రేపటితో నామినేషన్‌ గడువు ముగియనుండటంతో కాంగ్రెస్ అధిష్టానం.. ఫోన్లు చేసి నామినేషన్‌ పత్రాలను సిద్ధం చేసుకోవాలని వీరిద్దరికి సూచించింది. అయితే అద్దంకి దయాకర్‌ స్థానంలో బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఛాన్స్ కొట్టేసాడు. పైరవీలకు అడ్డా అయినా కాంగ్రెస్ లో ఇలాంటి వింతలు ఇంకెన్ని చూడాలో అని భయపడుతున్నారు జనాలు.

Latest News

More Articles