Saturday, May 18, 2024

తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. ఐఎండీ ఎల్లో అలెర్ట్‌ జారీ

spot_img

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వానలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇవాళ( శనివారం) నుంచి రేపు (ఆదివారం) వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయంది.

ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Latest News

More Articles