Friday, May 17, 2024

ఒకేరోజు 4 జాబ్‌ నోటిఫికేషన్లు జారీచేసిన టీఎస్‌పీఎస్సీ

spot_img

ఉద్యోగ జాతరలో భాగంగా రాష్ట్రంలో నోటిఫికేషన్ల వెల్లువ కొనసాగుతున్నది. ఇప్పటికే పోలీసు, హెల్త్‌, గ్రూప్స్‌ వంటి కీలక నోటిఫికేషన్లు విడుదల కాగా, ఇతర విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. 2022వ సంవత్సరం చివరి రోజైన శనివారం టీఎస్‌పీఎస్సీ నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 806 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు ఇచ్చింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 491 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 29 ఫిజికల్‌ డైరెక్టర్లు 24 లైబ్రేరియన్‌ పోస్టులు కలిపి మొత్తం 544 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 31 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 20 వరకు కొనసాగుతుంది.

నోటిఫికేషన్‌ వివరాలు, దరఖాస్తు కోసం అభ్యర్థులు www. tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ సూచించారు. ఇంటర్‌ విద్య, సాంకేతిక విద్యలో 71 లైబ్రేరియన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. వీటికి ఈ నెల 21 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై ఫిబ్రవరి 10 సాయంత్రం 5గంటలకు ముగుస్తుంది. ఈ పోస్టులకు ఆబ్జెక్టివ్‌ టైప్‌ రాత పరీక్షను మే/ జూన్‌ మాసాల్లో నిర్వహిస్తారు. రవాణాశాఖలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు 113, పురపాలికల్లో అకౌంట్స్‌ ఆఫీసర్‌ 78 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేసింది.

పురపాలికల్లో 78 అకౌంట్స్‌ ఆఫీసర్లు
పురపాలికల్లో 78 అకౌంట్స్‌ ఆఫీసర్‌ పో స్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేసిం ది. వీటిలో మూడు క్యా టగిరీల పోస్టులున్నాయి. వీటికి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 20 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 11 సా యంత్రం 5 గంటలకు ముగుస్తుంది.

113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు
రవాణాశాఖలో 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను భర్తీకి టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 12 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 1 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. రాత పరీక్షను ఏప్రిల్‌ 23న నిర్వహిస్తారు.

Latest News

More Articles