Saturday, May 18, 2024

డెంగ్యూ బారిన పడి రోగ నిరోధక శక్తి తగ్గిపోయిందా?.. వీటిని తింటే పెరుగుతుంది

spot_img

దోమ‌ల వ్యాప్తితో ప‌లు ఇన్ఫెక్ష‌న్లు, వ్యాధులు వస్తాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి ముప్పు వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. డెంగ్యూ వ్యాధి బారిన పడిన వారు సరైన సమయంలో జాగ్రత్త తీసుకోవాలి.వ్యాధినిరోధక శక్తి పూర్తిగా దెబ్బ తింటుంది. లేదంటే బ్లడ్ ప్లేట్ లెట్ లు పడిపోయి మృతి చెందే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడంతో పూర్తిగా కోలుకోవచ్చు .

డెంగ్యూ నుంచి కోలుకోవడానికి జామ పండు నిజ‌మైన సూప‌ర్‌ స్టార్‌గా పని చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పెంపొందించుకోవడానికి విటమిన్ సీ చాలా అవసరం. ఇది జామలో పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా జామలో ఉండే స‌హ‌జ‌మైన యాంటీ ఇన్ ఫ్లేమేటరీ గుణం కలిగిన క్వెరసిటిన్ జ్వరం, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలను తగ్గిస్తుంది. ఇక బొప్పాయి ఆకులను డెంగ్యూకు సహజమైన ఔషధంగా పనిచేస్తుంది. ఆకుల్లో ప‌పైన్, చిమోప‌పైన్ వంటి ఎంజైమ్‌లు అధికంగా ఉండ‌టంతో ఇవి ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచ‌డంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఆకుకూర‌లు, కాయ‌గూర‌ల్లో విట‌మిన్ ఏ, విట‌మిన్ సీ, విట‌మిన్ కే, ఫోలేట్ వంటి విట‌మిన్లు, మిన‌రల్స్ అధికంగా ఉండటంతో పాటు వీటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. బ్రకోలి, పాలకూర మంటి ఆకుకూరలను మన ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

Latest News

More Articles