Sunday, May 19, 2024

స్కూటీ ధర రూ. 30 వేలు.. దాని మీద చలాన్లు రూ. 3 లక్షలు

spot_img

ఆ స్కూటీ ఖరీదు రూ.30 వేలు.. కానీ దాని మీద ఉన్న జరిమానా మాత్రం రూ. 3.22 లక్షలు. అవును.. మీరు చదివేది నిజమే. అయితే దీనిలో అధికారుల తప్పేమీలేదు. సదరు స్కూటీవాహనదారుని నిర్వాకమే ఇంత భారీ జరిమానాకు కారణం. ఈ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది.

Read Also: క్రికెట్ జట్లను కొనుగోలు చేసిన బాలీవుడ్ హీరోలు

బెంగళూరు రోడ్డుపై ట్రాఫిక్‌ నియమాలను 643 సార్లు ఉల్లంఘించిన స్కూటీకి లక్షల రూపాయల జరిమానా పడింది. ఈ ఘటన ఆర్‌టీ నగరలో జరిగింది. స్కూటీపై ప్రయాణించిన వ్యక్తి హెల్మెట్‌ పెట్టకోకపోవడం, సిగ్నల్‌ జంప్‌, రాంగ్ పార్కింగ్ తద్వారా 643 సార్లు అతిక్రమణలకు పాల్పడ్డాడు. ట్రాఫిక్‌ కెమెరాలో ఇవన్నీ రికార్డ్‌ అయ్యాయి. దీంతో మొత్తం చలానాలను లెక్కించగా రూ. 3.22 లక్షలుగా తేలింది. ఇక ఆ స్కూటీ విలువ రూ. 30 వేలకు మించకపోవడం గమనార్హం.

అయితే ఆ స్కూటీ వ్యక్తి కోసం ట్రాఫిక్‌ పోలీసులు వెతకడం ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ నంబర్ కేఏ04KF9072తో ఈ స్కూటీ ఫిబ్రవరి 2022లో విక్రయమయ్యింది. ఈ వివరాలను బెంగళూరు ట్రాఫిక్ పోలీసు విభాగం తమ వెబ్‌సైట్‌లో నమోదు చేసింది.

Latest News

More Articles