Monday, May 13, 2024

రానున్న ఐదురోజుల పాటు తెలంగాణలో మండిపోనున్న ఎండలు..!

spot_img

తెలంగాణలో భానుడు భగభగ మండుతున్నాడు. మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. వేడి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తెలంగాణలో రానున్న ఐదురోజుల్లో ఎండలు విపరీతంగా పెరగనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. మొన్నటివరకు అకాలు వర్షాలు కురిస్తే..ఇప్పుడు ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ఎండల తీవ్రంగా ఉందని జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆదివారం నుంచి తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న ఐదు రోజుల్లో ఎండలు మరింత తీవ్రంఅవుతాయని పేర్కొన్నారు.

దక్షిణదిశ నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలుల వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని పేర్కొన్నారు. రెండు డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండ తీవ్రంగా భారీగా ఉంది. భానుడు భగభగ ఎక్కువవుతుందని, ఈ జిల్లాతో పాటు సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ వంటి మరికొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయని తెలిపారు. సిద్ధిపేట జిల్లాలో శనివారం నాడు 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు ఐఎండీ తెలిపింది. సంగారెడ్డి జిల్లా కల్హేరిలో ఉష్ణోగ్రతలు 38.7 డిగ్రీలు నమోదు కాగా, మెదక్ జిల్లా శివ్వంపేటలో 37.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

మరోవైపు ఎండల భారీగా నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారలుు సూచిస్తున్నారు. పగటిపూట అవసరం ఉంటే తప్పా బయటకు రావొద్దంటున్నారు అధికారులు. ఈ సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అటు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో బయటికి వెళ్లినవారు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివాటిని అధికంగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: బాలీవుడ్ క్వీన్‌కి బీజేపీ టికెట్..మండి నుంచి కంగనా పోటీ.!

Latest News

More Articles