Friday, May 10, 2024

లండన్ లో రోడ్డు ప్రమాదం.. భారత విద్యార్థిని దుర్మరణం.!

spot_img

లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతదేశానికి చెందిన చేష్టా కొచ్చర్ అనే విద్యార్థిని దుర్మరణం చెందారు. లండన్ స్కూల్ ఆప్ ఎకానామిక్స్ లో చేష్ఠా కొచ్చర్ పీహెచ్ డీ చేస్తున్నారు. ఈ విషయాన్ని నీతి అయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గతంలో ఆమె నీతి అయోగ్ కు సంబంధించిన ఓ ప్రాజెక్టు కోసం పనిచేసినట్లు తెలిపారు. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) డైరెక్టర్ జనరల్ అయిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ SP కొచ్చర్ కుమార్తె చెష్టా కొచర్.

ఆమె నీతి అయోగ్ లో లైఫ్ ప్రొగ్రామ్ పై పనిచేశారు. బిహేవియర్ సైన్స్ లో పీహెచ్ డీ చేయడానికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కు వెళ్లారు. సైక్లింగ్ చేస్తుండగా..జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. చాలా తెలివైన,దైర్యవంతురాలు. చాలా త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోయారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానంటూ అమితాబ్ కాంత్ పోస్టు చేశారు.

మార్చి 19న ఎస్ఎస్ఈ నుంచి సైకిన్ పై ఇంటికి తిరిగి వస్తుండగా ఓ ట్రక్కు ఢీకొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సమయంలో ఆమె భర్త ప్రశాంత కొంత దూరంలోనే ఉన్నారు. వెంటనే వచ్చి ఆసుపత్రికి తరలించే ప్రయత్నంచేశారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె తండ్రి లెఫ్టినెంట్ జనరల్ ఎస్పీ కొచ్చర్ ఆమె డెడ్ బాడీని తీసుకువచ్చేందుకు లండన్ లోనే ఉన్నారు. గురుగ్రామ్ లో నివాసం ఉండే చేష్టా సెప్టెంబర్ లో పీహెచ్ డీ కోసం లండన్ వెళ్లారు. గతంలో ఆమె ఢిల్లీ యూనివర్సిటీ, అశోక యూనివర్సిటీ, పెన్సిల్వేనియా షికాగో యూనివర్సిటిల్లో విద్యను అభ్యసించారు. 2021-23 మధ్య నీత అయోగ్ లోని నేషనల్ బిహేవియర్ ఇన్ సైట్స్ యూనిట్లో సీనియర్ సలహాదారుగా సేవలందించారు చేష్టా.

ఇది కూడా  చదవండి: రానున్న ఐదురోజుల పాటు తెలంగాణలో మండిపోనున్న ఎండలు..!

Latest News

More Articles