Saturday, May 18, 2024

విడాకులకు ఆరునెలలు ఆగాల్సిన అవ‌స‌రం లేదు

spot_img

విడాకులు కోరుకునే భార్యాభర్తలు ఇకపై ఆరునెలలు వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. క‌లిసి జీవించ‌లేని ప‌రిస్థితులు ఉన్న‌ప్పుడు.. ఆర్టిక‌ల్ 142 ప్ర‌కారం త‌న అధికారాల‌ను ఉప‌యోగించుకుని దంప‌తుల‌కు విడాకులు ఇవ్వవచ్చంది. దంప‌తులు ఇద్ద‌రూ విడాకుల‌కు అంగీక‌రిస్తే.. హిందూ వివాహ చ‌ట్టం ప్ర‌కారం ఆరునెలలు ఆగాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపింది సుప్రీంకోర్టు. జ‌స్టిస్ సంజ‌య్ కిష‌న్ కౌల్‌, సంజీవ్ ఖ‌న్నా, అభ‌య్ ఎస్ ఓకా, విక్ర‌మ్ నాథ్‌, జేకే మ‌హేశ్వ‌రిల‌తో కూడిన రాజ్యాంగ ధ‌ర్మాసనం ఈ కేసులో తీర్పునిచ్చింది.

ప్రాథ‌మిక హ‌క్కుల‌తో సంబంధమున్న ఆర్టిక‌ల్ 142 ని లెక్కలోకి  తీసుకుని.. కోర్టు త‌న అధికారాల‌తో న్యాయం చేస్తుంద‌ని సుప్రీం బెంచ్ తెలిపింది. హిందూ వివాహ చ‌ట్టంలోని సెక్ష‌న్ 13-బీ ప్ర‌కారం.. విడాకులు కావాల‌నుకునే జంట క‌చ్చితంగా ఆర్నెళ్లు వేచి ఉండాల్సి వ‌స్తోంది. అయితే విడాకులు ఆశించే జంట‌ల‌ను ఫ్యామిలీ కోర్టుల‌కు రెఫ‌ర్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని.. దాఖ‌లైన పిటిష‌న్ల విచార‌ణ స‌మ‌యంలో కోర్టు ఈ అదేశాలు జారీ చేసింది.

Latest News

More Articles