Friday, May 17, 2024

ఇప్పుడే అడ్మిషన్లు తీసుకోవద్దు: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక సూచనలు

spot_img

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రవేశాల షెడ్యూల్ రాకముందే కొన్ని కాలేజీలు అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని… ఇప్పుడే విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవద్దని సూచించింది.

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రవేశాల షెడ్యూల్ రాకముందే… కొన్ని కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టినట్లు వచ్చిన వార్తలు తమ దృష్టికి వచ్చాయని తెలిపింది. ఈ వార్తలపై స్పందించిన తెలంగాణ ఇంటర్ బోర్డు… కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఇంటర్ బోర్డు… ఇప్పటి వరకు అడ్మిషన్ల ప్రవేశ ప్రక్రియ నోటిఫికేషన్ ను విడుదల చేయలేదని చెప్పింది. 2024- 2025 అకాడమిక్ ఇయర్ కు సంబంధించి ఇంటర్ బోర్డు అనుబంధ కాలేజీల ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని తెలిపింది. త్వరలోనే అనుమతి పొందిన కాలేజీల జాబితాలను వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకొస్తామంది. https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఇంటర్ బోర్డు అనుమతి పొంది కాలేజీల జాబితాను చూడవచ్చని సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే ప్రవేశాలు పొందవద్దని, ఆ తర్వాజ ఆయా కాలేజీలకు అనుమతి లేకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించింది.

తెలంగాణ ఇంటర్ షెడ్యూల్ కు అనుగుణంగానే… ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని స్పష్టం చేసింది. ఇంటర్ బోర్డు ఆదేశాలను ఉల్లంఘిస్తే… సంబంధిత కాలేజీలపై చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: రేవంత్ నువ్వు మొగోనివి అయితే ఈ ప‌నులు చేసి చూపెట్టు

Latest News

More Articles