Friday, May 3, 2024

మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోన్న ‘ఖుషీ’ ట్రైలర్

spot_img

హైదరాబాద్: విజ‌య్ దేవ‌ర‌కొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. నిన్ను కోరి, మజిలీ ఫేం శివ‌నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇద్దరి మధ్య ఎలాంటి ట్రాక్ నడిచిందనేది కొంచెం సస్పెన్స్‌లో పెడుతూ ఫన్‌, రొమాంటిక్‌ టచ్‌తో సాగుతున్న ట్రైలర్‌ మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే ఖుషి ఫస్ట్‌ సింగిల్‌ నా రోజా నువ్వే నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. ఆరాధ్య సాంగ్‌ అందరినీ ఇంప్రెస్‌ చేస్తోంది. ఖుషి సినిమాను తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Latest News

More Articles