Sunday, May 19, 2024

నవ్వులు పూయిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ట్రైలర్

spot_img

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి నటించిన రొమాంటిక్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ..యూత్ కి కనెక్ట్ అయ్యే సీన్స్ తో ఆకట్టుకుంటుంది. హీరో నవీన్ స్టాండప్ కమెడియన్ గా నవ్వులు పూయిస్తున్నాడు. అనుష్క తన రెస్టారెంట్ లో అందమైన చెఫ్ గా ఉంటుంది.

లండన్ నుంచి వచ్చిన ఓ చెఫ్‌కు, హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఓ యువకుడికి మధ్య..రిలేషన్ షిప్‌ను చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. అనుష్క తనకి నచ్చిన అబ్బాయితో పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకుంటుంది. ఈ క్రమంలో అనుష్క-నవీన్ మధ్య వచ్చే సీన్స్ ఆద్యంతం ఆసక్తిగా కనిపిస్తున్నాయి. ఈ మూవీ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest News

More Articles