Monday, May 6, 2024

ప్లే స్టోర్ నుంచి 43 హానికర యాప్స్ తొలగింపు

spot_img

ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను తినేయడంతోపాటు యూజర్ల డేటాను తస్కరిస్తున్నాయని 43 యాప్స్‌ను తన ప్లే స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ ప్లే స్టోర్ ప్రకటించింది. యూజర్లు తమ ఫోన్లలో ఉన్న ఆయా యాప్స్‌ను డిలిట్ చేయాలని సూచించింది.

సదరు యాప్స్ యూజర్ల స్మార్ట్ ఫోన్లు టర్న్ ఆఫ్ అయినప్పుడు ఆ యాప్‌లు యాడ్స్ లోడ్ చేస్తున్నాయి. ఇది గూగుల్ ప్లే స్టోర్ పాలసీకి విరుద్ధమని తెలిపింది. ఇలా ఇప్పుడు 25 లక్షల రెట్లు ఈ యాప్స్ డౌన్ లోడ్ అయ్యాయని గూగుల్ ప్లే స్టోర్ వెల్లడించింది.

గూగుల్ ప్లే స్టోర్‌ పాలసీలను ఈ యాప్స్ ఉల్లంఘిస్తున్నాయని మొబైల్ రీసెర్చ్ టీం మైకేఫే అందజేసిన నివేదికపై గూగుల్ చర్యలు తీసుకున్నది. టీవీ/డీఎంబీ ప్లేయర్స్, మ్యూజిక్ డెవలపర్స్, న్యూస్, యాడ్స్ తరహా 43 యాప్స్ తొలగిస్తున్నట్లు గూగుల్ ప్లే స్టోర్ తెలిపింది.

మరోవైపు ట్రస్టెడ్ డెవలపర్స్ నుంచి యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాలని, ఇన్ స్టల్ చేసుకోవడానికి ముందు పర్మిషన్లు జాగ్రత్తగా ఇవ్వాలని మైకేఫ్ యూజర్లకు సూచించింది.

Latest News

More Articles