Saturday, May 18, 2024

గాజాపై తీర్మానాన్ని అడ్డుకున్న అమెరికా

spot_img

న్యూయార్క్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య దాడులతో గాజాలోని సామాన్య ప్రజలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. ఈ క్రమంలో గాజాలో తక్షణమే కాల్పులు విరమణ జరగాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి డిమాండ్‌ను అమెరికా తన వీటో పవర్‌ను ఉపయోగించి అడ్డుకున్నది.

ఇది కూడా చదవండి: ఆర్థిక మంత్రిగా భట్టి.. శ్రీధర్‌బాబుకు ఐటీ, పరిశ్రమలు

అంతకుముందు గాజాలో తక్షణమే కాల్పుల విరమణ కోసం యూఏఈ ప్రతిపాదించిన ముసాయిదాకు 13 మంది అనుకూలంగా ఓటేశారు. బ్రిటన్ ఓటింగ్‌కు దూరం జరిగింది. మండలిలో మొత్తం 15 సభ్య దేశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. గాజాలో పౌరుల రక్షణ కోసం, బందీల విడుదల కోసం యుద్ధంలో స్వల్ప విరామాలకు మాత్రం అమెరికా అనుకూలంగా ఉందని ఆ దేశ ప్రతినిధి రాబర్ట్‌ వుడ్‌ పేర్కొన్నారు.

Latest News

More Articles