Sunday, May 5, 2024

కాసుల వ‌ర్షం కురిపించిన వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 టోర్నీ

spot_img

న్యూఢిల్లీ : వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 టోర్నీ భార‌త క్రికెట్ బోర్డు(బీసీసీఐ)కి కాసుల వ‌ర్షం కురిపించింది. అలాగే భారత ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌పంచ క‌ప్‌ నిర్వాహణ ద్వారా రూ.22 వేల కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. ట్రావెల్, హాస్పిటాలిటీ రంగం నుంచి ఇంత పెద్ద మొత్తంలో డ‌బ్బులు రావ‌డం ఇదే మొద‌టిసారి అని నిపుణులు చెబుతున్నారు.

Also Read.. అమరవీరులకు నివాళులర్పించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

ప్ర‌పంచ క‌ప్ టోర్నీ వీక్షించేందుకు అభిమానులు రైళ్లు, విమాన టికెట్లు బుక్ చేసుకోవ‌డం, హోటళ్లు బుక్ చేసుకోవ‌డం ద్వారా కోట్ల‌లో ఖ‌ర్చు చేశారు. అధికారిక వెబ్‌సైట్‌, బుక్‌మైషో వెబ్‌సైట్ ద్వారా టికెట్ల అమ్మ‌కాలతో బీసీసీఐకి కూడా బాగా ఆదాయం వ‌చ్చింది.

Also Read.. డబ్ల్యూపీఎల్‌ వేలం.. 30 బెర్తుల కోసం 165 మంది పోటీ

ప్ర‌పంచంలోని క్రికెట్ బోర్డుల‌లో అత్యంత సంప‌న్న‌మైన‌ బీసీసీఐ నిక‌ర ఆదాయం విలువ రూ.18,760 కోట్లుగా ఉంది. ఇక బిగ్‌బాష్ లీగ్(BBL) పుణ్య‌మాని ఆస్ట్రేలియా క్రికెట్‌కు రూ. 658 కోట్లు వ‌చ్చాయి. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు రూ.493 కోట్ల ఆదాయంతో మూడో స్థానంలో నిలిచింది.

Latest News

More Articles