Wednesday, May 22, 2024

డబ్ల్యూపీఎల్‌ వేలం.. 30 బెర్తుల కోసం 165 మంది పోటీ

spot_img

హైదరాబాద్: వచ్చే ఏడాది జరుగనున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్‌) వేలం నేడు(శనివారం) జరుగనుంది. మొత్తం 30 బెర్తుల కోసం 165 మంది పోటీపడుతున్నారు. భారత క్రికెటర్లతో పాటు వివిధ దేశాల ప్లేయర్లు రేసులో ఉన్నారు. ఐదు ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొని ప్లేయర్లను ఎంపిక చేసుకుంటాయి.

Also Read.. రాష్ట్రంలో పెరుగుతున్న ఊబకాయుల సంఖ్య. కారణం ఇదేనట!

వేలంలో పాల్గొంటున్న ప్లేయర్లలో 104 మంది భారతీయులు ఉండగా, 61మంది విదేశీ మహిళా క్రికెటర్లు ఉన్నారు. ఇందులో 56 మంది క్యాప్‌డ్‌ ప్లేయర్లు కాగా, 109 మంది అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ల జాబితాలో ఉన్నారు. ఏ జట్టులోనైనా 18 మందికి మించకుండా ప్లేయర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. గుజరాత్‌ జెయింట్స్‌ అందరికంటే ఎక్కువగా 10 మందిని ఎంపిక చేసుకోనుంది.

WPL franchise details

Latest News

More Articles