Wednesday, May 1, 2024

రాష్ట్రంలో పెరుగుతున్న ఊబకాయుల సంఖ్య. కారణం ఇదేనట!

spot_img

హైదరాబాద్‌: తెలంగాణలో క్రమంగా ఊబకాయుల సంఖ్య పెరుగుతుందని జాతీయ పోషకాహార సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడించింది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు శరీరంలో అనవసరపు కొవ్వులకు కారణం అవుతున్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీలకు చెందిన 10 వేలకు మంది జీవనశైలి, ఆహారపు అలవాట్లను అధ్యయనం చేసినట్లు పరిశోధకులు తెలిపారు. వ్యర్థమైన కొవ్వులతోనే క్రమంగా ఒబెసిటీ కేసులు పెరుగుతున్నట్లు తేల్చారు.

Also Read.. కేసీఆర్‌కు సర్జరీ విజయవంతం.. కోలుకోవడానికి 6-8 వారాల సమయం

47 శాతం పట్టణాల్లో, 33 శాతం గ్రామీణ ప్రాంతాల్లో, 20 శాతం ఆరోగ్య స్థితిగతుల ఆధారంగా స్థూలకాయం ఉన్నదని వెల్లడించారు. వీరిలో హైపర్‌ టెన్షన్‌, అధిక బరువు, డయాబెటిస్‌ వంటి లక్షణాలు కూడా కనిపించాయని పరిశోధకుడు సమరసింహారెడ్డి తెలిపారు. ముఖ్యంగా 35 ఏండ్లు వయసు పైబడిన వారిలోనే స్థూలకాయం లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. మెజార్టీ ప్రజలకు ఆహార సమతుల్యతపై అవగాహన లేదని, అందుకే అధిక బరువు సమస్య వస్తుందని అధ్యయనంలో గుర్తించారు.

Also Read.. పెయిన్ కిల్లర్స్ అతిగా వాడుతున్నారా?బీకేర్ ఫుల్ ..ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!!

పట్టణాల్లో అధిక ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఒబెసిటీకి గురవుతున్నారట. ఫాస్ట్‌ ఫుడ్‌, అధిక చక్కెర, అధిక ఉప్పు కలిగి ఉండే ఇన్‌స్టంట్‌ వంటకాలతో పిల్లలు కూడా బాధితులు అవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఆహారపు అలవాట్లను మార్చుకొంటే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చని అధ్యయనంలో నిపుణులు సూచించారు.

Latest News

More Articles