Tuesday, May 21, 2024

జాతీయస్థాయిలో దుమారం రేపుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి ‘డీఎన్‌ఏ’ కామెంట్స్! 

spot_img

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ‘బీహార్‌ డీఎన్‌ఏ’ వ్యాఖ్య లు జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ది బీహార్‌ డీఎన్‌ఏ అని, ఆయన పూర్వీకులు బీహార్‌ నుంచి వలస వచ్చారని, అందుకే రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను తిరస్కరించి తెలంగాణ డీఎన్‌ఏ ఉన్న తనను ఎన్నుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Also Read.. రాష్ట్రంలో పెరుగుతున్న ఊబకాయుల సంఖ్య. కారణం ఇదేనట!

రేవంత్ వ్యాఖ్యలు బీహార్‌ను కించపరిచేలా ఉన్నాయని, తెలంగాణ డీఎన్‌ఏ, బీహార్‌ డీఎన్‌ఏ అంటూ వేర్వేరుగా ఉండవని, అందరిదీ హిందూస్థాన్‌ డీఎన్‌ఏనే అని జేడీయూ అధినేత, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.

Also Read.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్న 51 మంది ఎమ్మెల్యేలు

రేవంత్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటని, ప్రజలను విభజించేలా అవి ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ధ్వజమెత్తారు. ఆయన వ్యాఖ్యలపై బీహార్‌లోని కాంగ్రెస్‌ నేతలు ఎందుకు స్పదించడం లేదు? అని ప్రశ్నించారు. రేవంత్‌తో క్షమాపణ చెప్పించాలని కాంగ్రెస్‌తోపాటు ఇండియా కూటమిలోని ఇతర పార్టీలను డిమాండ్‌ చేశారు.

Also Read.. పెయిన్ కిల్లర్స్ అతిగా వాడుతున్నారా?బీకేర్ ఫుల్ ..ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!!

కాంగ్రెస్‌ పార్టీ విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నదని బీహార్‌ ఎంపీ, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీ, కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్‌ మండిపడ్డారు.  రేవంత్‌ రెడ్డితో క్షమాపణ చెప్పించాలని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా, ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ డిమాండ్‌ చేశారు.

Latest News

More Articles