Wednesday, May 1, 2024

తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్న 51 మంది ఎమ్మెల్యేలు

spot_img

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నది. సభలో సీనియర్‌ ఎమ్మెల్యే అయిన అక్బరుద్దీన్‌ ఒవైసీతో ఉదయం 8.30 గంటలకు స్పీకర్‌ ప్రొటెంగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ వెంటనే శాసనసభ నియమావళిని అనుసరించి ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

ఈసారి అసెంబ్లీలో 51 మంది కొత్తవారు అడుగుపెడుతున్నారు. వీరిలో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ఈసారి ఏకంగా 8మంది కొత్తవారు అసెంబ్లీకి రానున్నారు. కొత్తగా అడుగుపెడుతున్న వారిలో 18మంది ఎమ్మెల్యేలకు ఎలాంటి రాజకీయ రాజకీయ అనుభవం లేకపోవడం గమనార్హం. వీరందరూ ఎన్నికల్లో తొలిసారి పోటీచేసి గెలుపొందినవారే.

ఉమ్మడి జిల్లాల వారిగా కొత్తవారు

మహబూబ్‌నగర్‌ జిల్లా

1) అలంపూర్‌ – విజయుడు

2) నారాయణపేట -పరిణితారెడ్డి

3) మక్తల్‌ -వాకిటి శ్రీహరి

4) దేవరకద్ర- మధుసూదన్‌రెడ్డి

5) వనపర్తి -తూడి మేఘారెడ్డి

6) జడ్చర్ల -అనిరుధ్‌రెడ్డి

7) కల్వకుర్తి -కసిరెడ్డి నారాయణరెడ్డి

ఖమ్మం జిల్లా

1) పాలేరు -పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

2) వైరా- రాందాస్‌నాయక్‌

3) అశ్వరావుపేట – ఆదినారాయణ

4) సత్తుపల్లి -మట్టా రాగమయి

5) భద్రాచలం -తెల్లం వెంకట్రావు

వరంగల్‌ జిల్లా

1) వరంగల్‌ పశ్చిమ- నాయిని రాజేందర్‌రెడ్డి

2) వర్ధన్నపేట- కేఆర్‌ నాగరాజు

3) పాలకుర్తి -యశస్వినిరెడ్డి

4) మహబూబాబాద్‌ – మురళీనాయక్‌

5) డోర్నకల్‌ -రాంచంద్రనాయక్‌

6) భూపాలపల్లి- గండ్ర సత్యనారాయణరావు

7) జనగామ- పల్లా రాజేశ్వర్‌రెడ్డి

కరీంనగర్‌ జిల్లా

1) హుజూరాబాద్‌ -పాడి కౌశిక్‌రెడ్డి

2) వేములవాడ-ఆది శ్రీనివాస్‌

3) కోరుట్ల- డాక్టర్‌ సంజయ్‌

4) మానకొండూర్‌ -కవ్వంపల్లి సత్యనారాయణ

5) రామగుండం-రాజ్‌ ఠాకూర్‌

6) ధర్మపురి-అడ్లూరి లక్ష్మణ్‌

7) చొప్పదండి-మేడిపల్లి సత్యం

8) హుస్నాబాద్‌ -పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా

1) సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌- లాస్య నందిత

2) మల్కాజ్ గిరి -మర్రి రాజశేఖర్‌రెడ్డి

3) తాండూరు -మనోహర్‌రెడ్డి

4) ఉప్పల్‌- లక్ష్మీరెడ్డి

ఆదిలాబాద్‌ జిల్లా

1) ఆదిలాబాద్‌ – పాయల్‌ శంకర్‌

2) బోథ్‌ – అనిల్‌జాదవ్‌

3) మంచిర్యాల- ప్రేమ్‌సాగర్‌ రావు

4) సిర్పూర్‌-హరీశ్‌

5) చెన్నూర్‌ -వివేక్‌

6) ఖానాపూర్‌-ఎడమ బొజ్జు

7) ముథోల్‌ – రామారావుపటేల్‌

మెదక్‌ జిల్లా

1) దుబ్బాక -కొత్తప్రభాకర్‌రెడ్డి

2) మెదక్‌ – మైనంపల్లి రోహిత్‌రెడ్డి

నల్లగొండ జిల్లా

1) ఆలేరు- బీర్ల ఐలయ్య

2) నాగార్జునసాగర్‌- జైవీర్‌రెడ్డి

3) మిర్యాలగూడ- బత్తుల లక్ష్మీరెడ్డి

4) భువనగిరి- కుంభం అనిల్‌రెడ్డి

5) తుంగతుర్తి- మందుల సామెల్

నిజామాబాద్‌ జిల్లా

1) కామారెడ్డి -వెంకటరమణారెడ్డి

2) ఆర్మూర్‌- రాకేశ్‌రెడ్డి

3) నిజాబాద్‌ రూరల్‌ – డాక్టర్‌ భూపతిరెడ్డి,

4) నిజామాబాద్‌ అర్బన్‌- సూర్యనారాయణగుప్తా

5) జుకల్‌ – లక్ష్మీకాంతారావు

6) ఎల్లారెడ్డి -మదన్‌ మోహన్‌రావు

Latest News

More Articles