Friday, May 3, 2024

దేశవ్యాప్తంగా UPI పేమెంట్స్ హవా

spot_img

న్యూఢిల్లీ: కోవిడ్ దెబ్బకి ఫిజికల్ కాంటాక్ట్స్ లేకుండా ట్రాన్సాక్షన్స్ జరపడం కోసం UPI విధానం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా పేమెంట్స్ చేసే విధానాన్ని సమూలంగా మార్చేసింది. ఇది డెబిట్ కార్డుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించింది.

Also Read.. ప్రవళిక ఆత్మహత్యపై రేవంత్ విమర్శలను తిప్పికొట్టిన కవిత

ఆర్బీఐ-ఎన్పీసీఐ డేటా ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 7. 2 లక్షల కోట్ల రూపాయల డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ జరిగగా.. ఇదే సమయంలో ఒక కోటీ 39 లక్షల 20 వేల కోట్ల రూపాయల UPI ట్రాన్సాక్షన్స్ జరగడం గమనార్హం. అదే విధంగా 2022 ఫస్ట్ హాఫ్ లో 32 బిలియన్ల లావాదేవీలు డెబిట్ కార్డుల ద్వారా జరిగితే.. ఈ ఏడాది అదే సమయానికి 52 బిలియన్ల ట్రాన్సాక్షన్స్ UPI ద్వారా జరిగాయని వరల్డ్‌లైన్ తాజా ఇండియా డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్స్ తెలిపింది. విలువ పరంగా  47% పెరిగి 56,59,000 కోట్ల రూపాయల నుంచి 83,17,000 కోట్ల రూపాయలకు చేరుకుంది.

Also Read.. పొన్నాలకు బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం

అదే సమయంలో డెబిట్ కార్డుల వినియోగం 28%(1.38 బిలియన్ల ట్రాన్సాక్షన్స్) తగ్గింది. విలువ పరంగా 14% తగ్గి 3,17,000 కోట్ల రూపాయలకు చేరింది.   ఎస్బీఐ ఎకో రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం వ్యక్తి ఒక సంవత్సరం క్రితం సగటున 16 సార్లు ఏటీఎంని సందర్శించేవాడు. ఇప్పుడు ఏడాదికి 8 సార్లు మాత్రమే ఏటీఎంల మెట్లు ఎక్కుతున్నాడని నివేదిక తెలిపింది. సులభంగా డబ్బులు పంపించే వీలు ఉండడం,  ఫోన్ చేతిలో ఉంటే చాలు పెమెంట్ చేసేసే వీలు ఉండడం ప్రజలను UPI కి మారేలా చేస్తుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.

Latest News

More Articles