Saturday, May 18, 2024

అమలవుతున్నవే చెప్పిన ప్రియాంక.. కొత్తదనం లేని కాంగ్రెస్ యూత్‌ డిక్లరేషన్‌

spot_img

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ యూత్‌ డిక్లరేషన్‌ లో కొత్తదనమే లేదు. ఇప్పటికే రాష్ట్రంలో విద్యార్థులు, యువతకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే కాపీ కొట్టి పెట్టారు. వాటినే ప్రియాంక గాంధీతో మరోసారి చెప్పించి చప్పట్లు కొట్టించుకున్నారు. సోమవారం సరూర్‌నగర్‌లో యువ సంఘర్షణ పేరుతో సభ నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ.. మరోసారి నగుబాటుకు గురైంది.

ఉద్యమకారులపై కేసులు

కేసీఆర్ తొలి కేబినెట్‌ మీటింగ్‌లోనే ఉద్యమకారులపై కేసులను ఎత్తివేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

అమరుల కుటుంబాలకు ఉద్యోగం, పెన్షన్‌

తెలంగాణ ఏర్పడ్డ కొత్తలోనే అమరవీరుల కుటుంబాలన్నింటికీ ఇంటికో ఉద్యోగంతోపాటు రూ.10 లక్షల ఆర్థికసాయం అందించింది.

ఉద్యోగాల భర్తీ

తెలంగాణ ఏర్పడ్డ 9 ఏండ్లలో ఇప్పటి వరకు సు మారు 1.35 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 92 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు

ఇప్పటికే ఐటీశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ‘తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌(టాస్క్‌)’ పేరుతో కేంద్రాలను ఏర్పాటు చేసింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌

తెలంగాణలో ఇప్పటికే విద్యార్థులకు ఫీజు రియింబర్స్ మెంట్ అమల్లో ఉన్నది. కొన్ని వేల కోట్లను ఏటా ప్రభుత్వం విద్యార్థుల ఫీజులకు కేటాయిస్తుంది.

గల్ఫ్‌లో ఉద్యోగాలు

కార్మికశాఖ ఆధ్వర్యంలో ‘టామ్‌కామ్‌’ విజయవంతంగా కొనసాగుతుంది విదేశాల్లో ఉద్యోగాలను గుర్తించి యువతకు ఉపాధి కల్పిస్తున్నది.

కొత్త యూనివర్సిటీలు

విభజన సమయంలో తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన రాలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ కారణంగా కొత్తగా యూనివర్సీలు రాలే. కానీ తెలంగాణ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ పెడుతున్నది.

స్కూటీలతో మసాధికారత?

18 ఏండ్లు పైబడిన చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్‌ స్కూటర్లు అందజేస్తామని చెప్పడం మోసం చేయడమే. స్కూటర్ల ఇస్తే మహిళా సాధికారతసాధ్యమవుతుందా? అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది.

టీఎస్‌పీఎస్సీ

దేశంలోని ఇతర రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్స్‌తో పోల్చితే.. మన టీఎస్‌పీఎస్సీ బలంగా ఉన్నది. ప్రమాణాల విషయంలో యూపీఎస్సీతో పోటీ పడుతోంది. ఎన్నో సందర్భాల్లో యూపీఎస్సీ ప్రశంసలు కురిపించింది.

Latest News

More Articles