Sunday, May 19, 2024

మూడు రోజులు తెలంగాణలో వర్షాలు, భారీ ఈదురుగాలులు వీచే ఛాన్స్..!

spot_img

భానుడి ఉగ్రరూపంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫిబ్రవరి చివరి మాసం నుంచే  ఎండల తీవ్రత ఉండగా… ఏప్రిల్ ఎంట్రీ కావటంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటిపోయాయి. రాబోయే రోజుల్లో మరింత ఎండ తీవ్రంత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అత్యవసర పనులు అయితే తప్పా… మధ్యాహ్నం సమయంలో అసలు బయటికి వెళ్లవద్దని సూచిస్తోంది. మరోవైపు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా మండలాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. ఫలితంగా వడదెబ్బ కేసులు కూడా పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అయితే..తెలంగాణకు చల్లని కబురును చెప్పింది వాతావరణశాఖ. ఓవైపు మండుతున్న వేసవితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా… తాత్కాలిక ఉపశమనం కలిగించేలా కూల్ న్యూస్ చెప్పింది. ఈ ఏప్రిల్ 7, 8 తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి తాజా బులెటిన్ ను విడుదల చేసింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం… ఏప్రిల్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడకక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఏప్రిల్ 8వ తేదీన పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది. గాలి వేగం గంటకు 30- 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వివరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఇక ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 8.30 గంటల లోపు పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు పడొచ్చని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్ల, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్ 10వ తేదీన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడకక్కడ కురిసే ఛాన్స్ ఉందని ఓ ప్రకటనలో వివరించింది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో వాహన తనిఖీలో పట్టుబడ్డ నకిలీ నోట్లు

Latest News

More Articles