Monday, May 6, 2024

కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌ ను తిరస్కరించిన కోర్టు

spot_img

కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలన్న పిల్‌ను  ఢిల్లీ హైకోర్టు ఇవాళ(గురువారం)  మరోసారి  తిరస్కరించింది.  లిక్కర్‌ పాలసీ స్కాంకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో గత నెల కేజ్రీవాల్‌ను ఇడి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం కేజ్రీవాల్‌ తీహార్‌ జైలులో ఉన్నారు. సీఎం  స్వయంగా రాజ్యాంగ విధుల ఉల్లంఘనకు పాల్పడినట్లయితే, గవర్నర్‌ సిఎంను తొలగించగలరా అని సుప్రీంకోర్టు ఉత్తర్వులను సూచిస్తూ పిటిషనర్‌ విష్ణు గుప్తా హై కోర్టుని ప్రశ్నించారు.

ఈ విషయంలో న్యాయపరంగా జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేదని, పాలనాపరమైన జోక్యం చేసుకోలేమని మార్చి 28న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.   కెజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలంటూ సూర్జిత్‌ సింగ్‌ యాదవ్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

ఇది కూడా చదవండి: రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా సోనియా ప్ర‌మాణ స్వీకారం

Latest News

More Articles