Saturday, May 18, 2024

ఎల్లో అలెర్ట్‌.. రెండు రోజుల పాటు వర్షాలు

spot_img

రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయంది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

మంగళవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దీనికి సంబంధించి ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Latest News

More Articles