Saturday, May 18, 2024

ఫిబ్రవరిలో బ్యాంకులకు వచ్చే సెలవులు ఇవే

spot_img

దేశవ్యాప్తంగా సాధారణంగా బ్యాంకులకు రెండో శనివారం, ఆదివారం సెలవులు ఉంటాయి. ఇవేకాకుండా కొన్ని ప్రత్యేక రోజుల్లో కూడా సెలవులు ఉంటాయి. ఫిబ్రవరి నెల బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది.  అయితే, బ్యాంకలకు సెలవు ప్రకటించినా.. ఆరోజుల్లో ఆన్ లైన్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ యధావిధిగా పని చేస్తాయని ప్రకటించింది.

ఫిబ్రవరిలో బ్యాంకు సెలవులు:

* ఫిబ్రవరి 4వ తేదీన(ఆదివారం) దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

* ఫిబ్రవరి 10వ తేదీన రెండో శనివారం. బ్యాంకులు పనిచేయవు

* ఫిబ్రవరి 11వ తేదీన ఆదివారం. ఆరోజున బ్యాంకులకు సెలవు.

* ఫిబ్రవరి 14వ తేదీన బసంత్ పంచమి. త్రిపుర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌లలో బ్యాంకులకు సెలవు.

* ఫిబ్రవరి 15వ తేదీన లూయిస్-నాగై-ని. మణిపూర్‌లో బ్యాంకులకు సెలవు.

* ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం. సాధారణ సెలవు.

* ఫిబ్రవరి 19వ తేదీ ఛత్రపతి శివాజీ జయంతి. మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు.

* ఫిబ్రవరి 20వ తేదీన మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌ల స్టేట్ ఫార్మేషన్ కారణంగా బ్యాంకులకు సెలవు.

* ఫిబ్రవరి 24వ తేదీన శనివారం. జనరల్ హాలిడే.

* ఫిబ్రవరి 25వ తేదీన ఆదివారం. ఆరోజున బ్యాంకులు పనిచేయవు.

* ఫిబ్రవరి 26వ తేదీన న్యోకుమ్. అరుణాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు.

Also Read.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

Latest News

More Articles