Saturday, May 4, 2024

ఫ్రాన్స్ వెళ్లాలనుకునే విద్యార్థులకు ఆ దేశాధ్యక్షుడి గుడ్‎న్యూస్

spot_img

ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లో చదువుకునేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 2030 నాటికి దాదాపు 30 వేల మంది విద్యార్థులను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read also: గణతంత్ర దినోత్సవం సందర్భంగా 231 మంది ఖైదీల విడుదల

దీనికి సంబంధించి ఆయన ఓ ట్వీట్ చేశారు. తన పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మాక్రాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఫ్రెంచ్ ఫర్ ఆల్, ఫ్రెంచ్ ఫర్ ఏ బెటర్ ఫ్యూచర్’ అనే నినాదంతో యూనివర్సిటీల్లో ఫ్రెంచ్ నేర్చుకునేందుకు నెట్ వర్క్ రూపొందిస్తామని తెలిపారు. ఫ్రెంచ్ మాట్లాడలేని విద్యార్థులకు అంతర్జాతీయ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఫ్రాన్స్‎లో చదివిన పూర్వ విద్యార్థులకు వీసా సౌకర్యం కల్పిస్తామని ఈ సందర్భంగా మాక్రాన్ వెల్లడించారు.

Latest News

More Articles