Friday, May 17, 2024

తెలంగాణలో టాప్‌-10 సైబర్‌ మోసాలు ఇవే..!!

spot_img

హైదరాబాద్‌: అత్యాశకు పోయి కష్టార్జితాన్ని సమర్పించుకుంటున్న వారిలో చదువుకున్న వారే అధికంగా ఉంటున్నారు. ఈ ఏడాది నమోదైన సైబర్‌ నేరాల్లో ‘ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్‌’ టాప్‌లో ఉందని, ఆ తర్వాతి స్థానాల్లో ఫేక్‌ లోన్లు, ఫేక్‌ కస్టమర్‌ సేవలు వంటి మోసాలు ఉన్నట్టు సైబర్‌ నిపుణులు వెల్లడించారు. 2019లో ఈ తరహా 2,013 కేసులు నమోదవ్వగా.. 2022-23లో ఆ సంఖ్య 50,374కు చేరుకున్నది.

Also Read.. తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే పిల్లలకు మద్రాస్‌ హైకోర్టు షాక్‌..!

సైబర్‌ నేరాలు మొదలైన కొత్తలో చదువు, టెక్నాలజీ తెలియని వారు ఎక్కువగా మోసపోయారు. మీకు గిఫ్ట్‌ వచ్చిందని, బ్యాంకు అకౌంట్‌ నుంచి డబ్బులు కట్‌ అయ్యాయని, బ్యాంకు మేనేజర్‌ పేరిట, లక్షల్లో లాటరీ తగిలిందనే తరహా మోసాలు విపరీతంగా జరిగేవి. అనంతరం కాలంలో సైబర్‌ నేరాలపై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించడం,  ప్రజల్లో చైతన్యం పెరగడంతో ఆ తరహా మోసాలు తగ్గిపోయాయి.

Also Read.. ఇంట్లో బొద్దింకల బెడద ఎక్కువైందా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!!

ఇటీవల సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్‌ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను టార్గెట్‌ చేస్తున్నారు. బిజినెస్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్‌కు తెర తీశారు. ఎవరైనా గూగుల్‌ వంటి సెర్చ్‌ ఇంజిన్లలో తమకు కావల్సిన సేవల కోసం వెతికితే వెంటనే ఫేక్ కాల్స్‌ చేసి మోసం చేస్తున్నారు. థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల సమాచారం తెలుసుకొని, వాటిని క్లోనింగ్‌ చేస్తూ మోసగిస్తున్న ఉదంతాలు ఉన్నాయి.

Also Read.. ఊరిలోనే ఉంటూ ఈ బిజినెస్ చేస్తే..ప్రభుత్వ ఉద్యోగి కంటే ఎక్కువ సంపాదించవచ్చు..!!

చదువుకున్నవారు, ముఖ్యంగా ఉద్యోగుస్తులు సైబర్‌ నేరాలపట్ల ప్రతిక్షణం అప్రమత్తంగా, తెలివితో ఉండాలని ‘ఎండ్‌ నౌ’ ఫౌండేషన్‌ సైబర్‌ నిపుణుడు  అనిల్‌ రాచమల్ల సూచిస్తున్నారు. మోసపోయినట్టు గుర్తించిన 24 గంటలలో ఫిర్యాదు చేస్తే ఎంతోకొంత నగదు బదిలీకాకుండా తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చూస్తారన్నారు.

తెలంగాణలో టాప్‌-10 సైబర్‌ మోసాల జాబితా

  1. బిజినెస్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్‌
  2. నకిలీ కస్టమర్‌ కేర్‌ సర్వీస్‌ (గూగుల్‌ ద్వారా)
  3. అమ్మాయి/అబ్బాయిలా నమ్మించడం
  4. పార్ట్‌టైమ్‌ జాబ్‌ ఫ్రాడ్స్‌
  5. క్రెడిట్‌ కార్డుల సిమ్మింగ్‌/క్లోనింగ్‌
  6. లక్షల్లో లోన్‌ మంజూరైందని బురిడీ కొట్టించడం
  7. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు పాన్‌కార్డుకు లింక్‌పేరిట మోసం
  8. ఓఎల్‌ఎక్స్‌ వంటి ఈ-కామర్స్‌ వెబ్‌సైట్స్‌లో యాడ్స్‌ ద్వారా మోసం
  9. లోన్లు ఇప్పిస్తామని వాయిస్‌, స్మిషింగ్‌లతో మోసాలు
  10. నకిలీ సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ ద్వారా డబ్బులు అడగటం

Latest News

More Articles