Sunday, May 19, 2024

తిరుమల మెట్లమార్గంలో విషాదం.. చిన్నారిని ఎత్తుకెళ్లి తిన్న పులి

spot_img

తిరుమల అలిపిరి నడక మార్గంలో విషాదం చోటుచేసుకుంది. గత నెల మెట్ల మార్గంలో ఓ బాలుడిపై చిరుత దాడి చేసిన విషయం మరవకముందే.. నిన్న శుక్రవారం మరో చిన్నారిపై చిరుత దాడిచేసింది. అలిపిరి కాలినడక మార్గంలో వెళ్తున్న ఆరేండ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి తినేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా పొతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన లక్షిత (6) తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో అలిపిరి నుంచి కాలినడకన తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరింది. ఈ క్రమంలో రాత్రి 11 గంటలకు వారంతా లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. అక్కడ ముందు నడుస్తున్న లక్షితపై చిరుతపులి ఒక్కసారిగా దాడిచేసింది. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో పాపను అడవిలోకి లాక్కెళ్లింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రాత్రి సమయం కావడంతో గాలింపు వీలుపడలేదు. ఉదయం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు.. లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి కొద్ది దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పాపను సగానికి తిని వదిలివెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు.

Latest News

More Articles