Saturday, May 4, 2024

చిలుకూరులో నేటి వివాహప్రాప్తి రద్దు..!

spot_img

చిలుకూరు బాలాజీఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారికల్యాణం జరగనుంది.అయితే శుక్రవారంఆలయంలో గరుడ ప్రసాదం వితరణజరగడంతో ఊహించని విధంగా భక్తులు పెద్దెత్తున తరలివచ్చారు. పెద్దసంఖ్యలు వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈపరిస్థితులను ద్రుష్టిలో ఉంచుకుని చిలుకూరి బాలాజీ ఆలయంలో ఈ రోజు జరగాల్సిన వివాహప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈమేరకు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ విషయాన్ని వెల్లడించారు.

కల్యాణోత్సవం నిమిత్తం ఈ రోజు ఎవరూ వివాహ ప్రాప్తి కార్యక్రమానికి రాకూడదని కోరారు. పెళ్లికోసం ఎదురుచూసే వారు తమ ఇళ్ల నుంచి దేవుడిని ప్రార్థించుకోవాలని సూచించారు. ఈరోజు సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. శుక్రవారం చిలుకూరు ఆలయంలో గరుడప్రసాద వితరణలో ఇబ్బందులు తలెత్తడంతో వివాహాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. చిలుకూరు బాలాజీ ఆలయంలో ఈనెల 25 వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం అనంతరం గరుత్మంతుడికి సమర్పించే గరుడ ప్రసాదాన్ని సంతానం లేని మహిళలు స్వీకరిస్తే సంతానం కలుగుతుందని చాలా మంది భక్తుల విశ్వాసం.

ఇది కూడా చదవండి: 30 ఏళ్ల తర్వాత ప్రతి పురుషుడు తీసుకోవలసిన విటమిన్లు ఇవే.!

Latest News

More Articles