Tuesday, May 21, 2024

సిటీలో 11 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు.. ఏయే రూట్లలో అంటే..

spot_img

వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంతో హైదరాబాద్ నగరంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు నగర వ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు నగరానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో 11 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

రాజ్‌దూత్ లైన్-గణేష్ తరహా రహదారిపై వాహనాలను అనుమతించరు. రాజ్ దత్ లేన్ దగ్గర ఇక్బాల్ మినార్ వైపు వాహనాలను మళ్లిస్తారు. రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి మింట్ కాంపౌండ్ వరకు సాధారణ ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఆ వైపు వెళ్లే వాహనాలను రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు. మింట్ కాంపౌండ్ నుండి ఐమాక్స్ థియేటర్ వైపు సాధారణ ట్రాఫిక్ అనుమతించబడదు. మింట్ శ్రీ కాంపౌండ్ వద్ద తెలుగు తల్లి జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను మళ్లిస్తారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాల్లో ప్రయాణాన్ని కొనసాగించాలని పోలీసులు సూచించారు.

ప్రతి రోజూ అర్ధరాత్రి వరకు

ఈ ఆంక్షలు ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను బట్టి ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రయాణంలో ఏదైనా అసౌకర్యం ఉంటే.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ – 9010203626ను సంప్రదించాలని కోరారు పోలీసులు.

మరిన్ని వార్తలు..
తెలంగాణపై మోడీ విషం.. స్ట్రాంగ్ కౌంటరిచ్చి కేటీఆర్

Latest News

More Articles