Monday, May 13, 2024

ఎయిర్ రేసింగ్ చాంపియన్‌ షిప్: విమానాలు ఢీకొని ఇద్దరు పైలట్ల మృతి

spot_img

అమెరికాలో రెండు విమానాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు చనిపోయారు. నెవడా రాష్ట్రంలో రెనో ఎయిర్ రేసింగ్‌లో విమానాలు ఒకదాన్నొకటి ఢీకొన్నట్టు ఎయిర్ రేసింగ్ అసోసియేషన్ తెలిపింది. నిన్న( ఆదివారం) మధ్యాహ్నం 2.15 గంటలకు విమానాలు ఢీకొన్నట్టు చెప్పింది. ప్రమాదంలో మృతి చెందిన పైలట్ల వివరాలు తెలియాల్సి ఉంది.

రెనోలో నిర్వహించిన నేషనల్ చాంపియన్‌షిప్ ఎయిర్ రేస్ చివరి రోజు ఈ ఘటన జరిగింది. ల్యాండవుతున్న సమయంలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు.

Latest News

More Articles