Saturday, May 18, 2024

హే రేవంత్ రెడ్డి మళ్ళీ ఏసేశాడు.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం

spot_img

బుధవారం ఎల్‌బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో నూతనంగా విధుల్లో చేరిన స్టాఫ్‌ నర్సులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా బహుళ ఆరోగ్య సంరక్షణ విభాగాల్లో మొత్తం 6956 స్టాఫ్ నర్సుల పోస్టులు భర్తీ చేయబడ్డాయి. అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ స్టాఫ్ నర్సుల ఉద్యోగాల పత్రాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించినవే. అప్పట్లో ఎన్నికల కోడ్ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. గత ముఖ్యమంత్రి కేటాయించిన ఉద్యోగాలనే రేవంత్ రెడ్డి నర్సులకి ఇచ్చారని కొత్తగా కాంగ్రెస్ చేసిందేమి లేదని.. మేమిచ్చిన ఉద్యోగాలకే జీతాలు ఇస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు కౌంటర్లు ఇస్తున్నారు.

అయితే ఈ వేదిక నుండి సీఎం రేవంత్ అతిపెద్ద జోక్ ఒకటి చెప్పారని అంటున్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం అని రేవంత్ చెప్పటం హాస్యాస్పదం అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిన ఒక్క పథకం కూడా ఇప్పటివరకు అమలు చేయని రేవంత్ రెడ్డి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే ప్రజలు నమ్మరని అంటున్నారు. ఉచిత కరెంట్, రైతుబంధు, పెన్షన్స్, రుణమాఫీ, గృహలక్ష్మి. దళితబంధు, నిరుద్యోగభృతి ఇలా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అయితే ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేస్తె గ్యారెంటీలు అమలు చేస్తామని ఉద్దెర కబుర్లు చెప్తున్న రేవంత్ మాటలు నమ్మమంటున్నారు జనాలు.

Latest News

More Articles