Saturday, May 4, 2024

రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు.. కేసీఆర్ హయంలో ఇచ్చినవే..!

spot_img

రేవంత్ ఇచ్చిన స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు కేసీఆర్ హయంలో కేటాయించినవే అని అన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. తాజాగా మీడియాతో ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం సంతోషం. రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ హయంలో జరిగినవే. ఎన్నికల కోడ్ తో ఆలస్యం అయ్యింది. మేము నియమించిన ఉద్యోగాలకు మీరు జీతాలు ఇస్తున్నారా..లేరా..?

బీఆర్ఎస్ హయంలో నిర్వహించిన ఉద్యోగాలకు నియమాక పత్రాలు ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిది. రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాల ను నోటిఫై చేయండి.. 2024 చివరి వరకు పూర్తి చేయండి. కేసీఆర్ హయం లో లక్ష 60 వేలు ఉద్యోగాలు ఇచ్చాం. ఎన్నికల ప్రచారంలో చేసిన పనులను చెప్పకుండా చేశారు. ఇక బండి సంజయ్ కంటే ముందు నేనే పుట్టాను. అయితే ఓటమి భయానికే బండి సంజయ్ నా పై నాన్ లోకల్ ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు వినోద్ కుమార్.

Latest News

More Articles