Saturday, May 18, 2024

చార్జీలు తగ్గించిన టీఎస్‌ఆర్టీసీ

spot_img

టీఎస్‌ఆర్టీసీ తమ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆర్థిక భారం త‌గ్గించ‌డానికి ముందస్తు రిజర్వేషన్‌ చార్జీలను సవరించింది. ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో చార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎక్స్ ప్రెస్, డీల‌క్స్ స‌ర్వీసుల్లో 350 కిలో మీట‌ర్ల లోపు రూ.20, 350 ఆపై కిలోమీట‌ర్ల‌కు రూ.30 తగ్గించాలని నిర్ణ‌యించింది. సూప‌ర్ ల‌గ్జ‌రీ, ఏసీ సర్వీసుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటే రూ.30 వ‌సూలు చేయ‌నుంది.

టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ముంద రిజర్వేషన్‌ మంచి స్పందన ఉందని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రతి రోజు సగటున 15 వేల వరకు ముంద‌స్తుగా ప్ర‌యాణికులు టికెట్లు రిజర్వేషన్‌ చేసుకుంటున్నారు. వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్‌ చార్జీలను తగ్గించామ‌ని చెప్పారు. ఈ వ‌స‌తిని ప్రయాణికులంతా ఉపయోగించుకుని.. సంస్థను ఆదరించాలని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు.

Latest News

More Articles