Saturday, May 18, 2024

అండర్‌-19 వరల్డ్‌ కప్‌.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్ ఉంచిన యువభారత్

spot_img

ఐసీసీ అండర్‌ -19 వరల్డ్‌ కప్‌లో భారత్‌ మరోసారి భారీ స్కోరుచేసింది. దక్షిణాఫ్రికాలోని బ్లూమ్‌ఫోంటైన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న పోరులో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఈ టోర్నీలో ఇదివరకే ఓ సెంచరీ, మరో అర్థ సెంచరీతో జోరుమీదున్న ముషీర్‌ ఖాన్‌.. 126 బంతుల్లో 131 పరుగులు చేసి మరోసారి చెలరేగాడు. 109 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్న ముషీర్‌ ఆ తర్వాత బ్యాట్‌ ఝుళిపించాడు. ఈ టోర్నీలో అతడికి ఇది రెండో శతకం కావడం గమనార్హం. ఈ టోర్నీలో మరో శతకం చేస్తే ముషీర్‌.. 2004లో శిఖర్‌ ధావన్‌ పేరిట ఉన్న మూడు సెంచరీల (అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌లో) రికార్డును సమం చేస్తాడు. గ్రూప్‌ దశలో మూడు మ్యాచ్‌లను గెలిచి సూపర్‌ సిక్స్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న భారత్‌.. ముషీర్‌కు తోడుగా ఓపెనర్‌ ఆదర్శ్‌ సింగ్‌ 58 పరుగులు, కెప్టెన్‌ ఉదయ్‌ సహరన్‌ 34 పరుగులతో రాణించడంతో కివీస్‌ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది.

https://twitter.com/ICC/status/1752288013747405300?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1752288013747405300%7Ctwgr%5Eaf1e3d26c385a05b94d113612bd78df9a9fdf07d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fsports%2Ficc-under-19-world-cup-2024-musheer-khan-century-india-sets-296-target-to-new-zealand-1454360

Latest News

More Articles