Sunday, May 19, 2024

సనాతన ధర్మాన్ని నాశనం చేస్తేనే…అంటూ మరోసారి విషం చిమ్మిన ఉదయనిధి స్టాలిన్..!!

spot_img

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం అలవాటుగా మారిన డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన్‌పై విషం చిమ్ముతూనే, సనాతన నిర్మూలనతో అంటరానితనం కూడా అంతం అవుతుందని అన్నారు. అంటరానితనం అంతం కావాలంటే సనాతన సంస్థను రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.

రాష్ట్రంలో సామాజిక వివక్షపై తమిళనాడు గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మంగళవారం ఆయన ఈ ప్రకటన చేశారు. తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కులం ఆధారంగా సామాజిక వివక్ష కనిపిస్తోందని గవర్నర్ రవి గత వారం ఒక సాంస్కృతిక కార్యక్రమంలో అన్నారు. గతంలో సనాతన ధర్మం గురించి తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నాను అన్నారు.

ఉదయనిధి స్టాలిన్ కొన్నిరోజుల క్రితం సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి వ్యాధుల లాంటిదని కొంతకాలం క్రితం సనాతన్ నిర్మూలన్ సమ్మేళన్‌లో ఉదయనిధి చెప్పడంతో వివాదం చెలరేగింది. కొన్ని విషయాలను వ్యతిరేకించలేము. దాన్ని పూర్తిగా నాశనం చేయాలంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

Latest News

More Articles