Monday, May 6, 2024

నటుడు ప్రకాశ్‎రాజ్‎ను హత్య చేస్తామంటూ వార్నింగ్..యూట్యూబ్ ఛానెల్ పై కేసు..!!

spot_img

సనాతన ధర్మంపై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలతో ఆయనకు హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ సంచలన ప్రకటనల కారణంగానే ప్రకాశ్ రాజ్ ఎన్నోసార్లు ఇబ్బందుల్లో పడ్డారు. తాజాగా మరోసారి ఆయన్ను హత్యచేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ బెదిరింపు వచ్చిన తర్వాత ప్రకాశ్ రాజ్ ఓ యూట్యూబ్ ఛానెల్ పై బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ యూట్యూబర్ మీద కేసు నమోదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న రెండు రోజుల తర్వాత కేసు నమోదు చేవారు. ప్రకాశ్ రాజ్ ను చంపేస్తామని బెదిరిస్తున్న వీడియోను చూపించినందుకు గాను సదరు యూట్యూబ్ ఛానెల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు రోజుల క్రితం అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారని..ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విచారణ జరుపుతున్నామని సెంట్రల్ డీసీపీ తెలిపారు. కాగా పలు మీడియా కథనాల ప్రకారం..ప్రకాశ్ రాజ్ పై బెదిరింపులతో కూడిన వీడియోను యూట్యూబ్ లో వేలాది మంది వీక్షించినట్లు తెలుస్తోంది. యూట్యూబ్ విక్రమ ఛానెల్లో తనను, తన కుటుంబాన్ని ప్రతికూలంగా చిత్రీకరించారని ప్రకాశ్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Latest News

More Articles