Saturday, May 18, 2024

ఇంపాల్ విమానాశ్ర‌యం వ‌ద్ద యూఎఫ్‌వో కలకలం

spot_img

ఇంపాల్‌: మ‌ణిపూర్‌లోని ఇంపాల్ విమానాశ్ర‌యం వ‌ద్ద ఆదివారం యూఎఫ్‌వో(UFO) కనిపంచడం కలకలం రేపింది. త‌క్ష‌ణ‌మే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. రెండు ర‌ఫేల్ యుద్ధ విమానాలు ఆకాశంలో చక్కర్లు కొట్టాయి. కానీ ఆ యూఎఫ్‌వో ఏంటో అంతు చిక్క‌లేదు. ఆదివారం మ‌ధ్యాహ్నం 2.30 నిమిషాల స‌మ‌యంలో యూఎఫ్‌వో క‌నిపించింది.

Also Read.. ఇందిర‌మ్మ రాజ్యం అంతా ఆక‌లే క‌దా..? ఎమ‌ర్జెన్సే క‌దా..?

ఈ నేపథ్యంలో బిర్ తికేంద్ర‌జిత్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో క‌మ‌ర్షియ‌ల్ విమానాల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. ఆ యూఎఫ్‌వోను గుర్తించేందుకు హ‌సిమ‌రా ఎయిర్ బేస్ నుంచి ర‌ఫేల్ ఫైటర్ జెట్స్ రంగంలోకి దిగాయి.  కానీ ఆ చిన్న వస్తువు మ‌ళ్లీ క‌నిపించ‌లేద‌ని ఈస్ట్ర‌న్ క‌మాండ్ వెల్లడించింది. అయితే, సాయంత్రం 4 గంట‌ల త‌ర్వాత ప‌శ్చిమం వైపునకు ఆ యూఎఫ్‌వో  వెళ్లిన‌ట్లు స్థానిక ప్ర‌జ‌లు తెలిపారు.

Latest News

More Articles