Sunday, May 19, 2024

UGC NET: నేటి నుంచి యూజీసీ నెట్ పరీక్షలు..అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోండిలా.!!

spot_img

జూనియర్ రిసర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష యూజీసి నెట్ పరీక్ష నేటి నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 292 పట్టణాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. మొత్తం 83 సబ్జెక్టులకు గాను రెండు సెషన్లలో ఈ పరీక్ష ఉంటుంది. దీనికి సంబంధించి అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిలీజ్ చేసింది. అభ్యర్థులు పరీక్ష రోజు ఉదయం వరకు ఎన్టీఏ వెబ్ సైట్ తోపాటు https://ugcnet.nta.nic.in/ వెబ్ సైట్ ద్వారా తమ హాట్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కంప్యూటర్ బేస్డ్ గా నిర్వహించే పరీక్ష రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి పేపర్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. ప్రతిపేపర్ లో మొత్తం 150 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కును కేటాయించారు. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. అంటే సమాధానం తప్పుగా గుర్తించినా మార్కులు కోత విధించరు.

ఇది కూడా చదవండి: భోజనం చేసిన తర్వాత 20 నిమిషాలు నడుస్తే బోలెడన్ని ప్రయోజనాలున్నాయి..!!

Latest News

More Articles