Monday, May 20, 2024

దేశంలో 16 నెల‌ల గ‌రిష్ట స్ధాయికి నిరుద్యోగ రేటు!

spot_img

దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన ఏడాది డిసెంబ‌ర్‌లో నిరుద్యోగ రేటు 16 నెల‌ల గ‌రిష్ట స్థాయిలో 8.30 శాతానికి ఎగ‌బాకింది. న‌వంబ‌ర్‌లో నిరుద్యోగ రేటు 8 శాతం కాగా.. డిసెంబ‌ర్‌లో అది 8.3 శాతానికి పెరిగింద‌ని సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ (సీఎంఐఈ) స్ప‌ష్టం చేసింది.

న‌వంబ‌ర్‌లో 8.96 శాతంగా ఉన్న న‌గ‌ర ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు డిసెంబ‌ర్‌లో ఏకంగా 10.09 శాతానికి పేరగగా.. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత 7.55 శాతం నుంచి 7.44 శాతానికి త‌గ్గింది. సీఎంఐఈ గ‌ణాంకాల ప్ర‌కారం.. దేశంలో నిరుద్యోగ రేటు డిసెంబ‌ర్‌లో 16 నెల‌ల గ‌రిష్ట‌స్ధాయిలో 8.30 శాతానికి పెర‌గ‌డం ఆందోళ‌న రేకెత్తిస్తోంది.

హ‌ర్యానాలో నిరుద్యోగ రేటు డిసెంబ‌ర్‌లో అత్య‌ధికంగా 37.4 శాతానికి పెరిగింది. రాజ‌స్ధాన్‌లో ఇది 28.5 శాతం కాగా.. దేశ రాజ‌ధాని ఢిల్లీలో నిరుద్యోగ రేటు ఏకంగా 20.8 శాతంగా న‌మోదైందని సీఎంఐఈ గ‌ణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Latest News

More Articles