Friday, May 17, 2024

కిడ్నాప్ చేసేందుకు దుండగుల యత్నం.. తప్పించుకున్న మహిళ

spot_img

హర్యానాలో ఓ మహిళలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో పారిపోయారు.యమునా నగర్‌ కు చెందిన ఓ మహిళ జిమ్ కి వెళ్లి తర్వాత బయటకి వచ్చి తన కారులో కూర్చుంది. ఇంతలో నలుగురు వ్యక్తులు మెల్లగా ఆ కారు దగ్గరకు వచ్చి ..డోర్లు తీసి అందులోకి ఎక్కి ఆ మహిళను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. గట్టిగా అరవడంతో పాటు కిడ్నాపర్లపై తిరగబడింది. దీంతో వారు భయంతో కారు దిగి అక్కడి నుంచి పారిపోయారు.దుండగులు మహిళను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించిన ఈ సంఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డ్‌ అయ్యింది.

ఆమె ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు జరిపారు. కిడ్నాపర్లలో ఒకరిని అరెస్ట్‌ చేసినట్లు యమునా నగర్‌ డీఎస్పీ కమల్‌దీప్‌ సింగ్‌ తెలిపారు. మిగతా ముగ్గురి ఆచూకీ కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు. ఆ మహిళ కిడ్నాప్‌ ప్రయత్నానికి కారణం ఏంటనే దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Latest News

More Articles