Friday, May 10, 2024

భద్రాద్రిలో రేపు ఉత్తర ద్వారంలో లక్ష్మణ సమేత సీతారాముల దర్శనం

spot_img

భద్రాద్రిలో రేపు(సోమవారం) ఉదయం ఉత్తర ద్వారం నుంచి లక్ష్మణ సమేత సీతారాములు భక్తులకు దర్శనమివ్వనున్నారు. సోమవారం తెల్లవారుజామున 12 గంటల నుంచి 1 గంట వరకు సుప్రభాత సేవ, ఆరాధన ఏకాంత సేవ నిర్వహించనున్నారు ఆలయాధికారులు. తెల్లవారుజామున 1 గంట నుంచి 2.30 గంటల వరకు మూలవర్లకు విశేష స్నపన తిరుమంజనం. తర్వాత తెల్లవారుజామున 2.30 నుంచి 3.30 గంటల వరకు స్వామివార్లకు అలంకరణ, బాల భోగం నివేదన, తిరుప్పావై సేవా కాలం నిర్వహించనున్నారు. ఆ తర్వాత తెల్లవారుజామున 3.45 నిమిషాలకు భక్తులకు మూలవరుల దర్శనం కల్పిస్తారు.

తెల్లవారుజామున 5 గంటలకు ఉత్సవమూర్తులు వైకుంఠ ద్వారం దగ్గరకు వేంచేయుట…ఉదయం 4:40 నుంచి 5 గంటల వరకు ద్వార దర్శన ప్రాసస్త్యము ప్రవచనము.ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీ వైకుంఠ ద్వారం తెరుచుట, మంగళ వాయిద్యములు, స్వామివారికి వివిధ పూజలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి స్వామివారు ఉత్తర ద్వారం నుంచి తిరువీధి సేవకు బయలుదేరుతారు.

Latest News

More Articles