Monday, June 17, 2024

ఇండియా వర్సెస్ భారత్: పేరు మార్పుపై స్పందించిన ఐక్యరాజ్య సమితి

spot_img

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం ‘ఇండియా’ పేరు మార్పుపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఇండియా పేరు ఇంగ్లీష్‌లో కూడా ‘భారత్’ గా మారనుందా అని విలేకరులు ప్రశ్నలు ప్రశ్నించగా.. ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ స్పందించారు.

ఇది కూడా చదవండి.. ఆర్థిక సంక్షోభంలో బ్రిటన్‌..!!  

ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరు మీద రాష్ట్రపతి నుంచి ఆహ్వానాలు రావడం రేగింది. ఇప్పుడు మొత్తం ఇదే చర్చ నడుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి దీనిపై తాజాగా ఐక్యరాజ్యసమితి కూడా తమ స్పందనను తెలియజేసింది.

దేశాల పేర్ల మార్పులపై ఆయా దేశాల నుంచి అభ్యర్థనలు వచ్చినట్లైతే.. వాటిని స్వీకరిస్తామన్నారు. వారి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకొని ఆయా దేశాల పేర్లలో మార్పులను చేస్తామని తెలిపారు. గతేదాడి టర్కీ పేరును తుర్కియేగా మార్చుకున్న విషయాన్ని గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి.. భారీ భూకంపంతో వణికిన ఉత్తర చిలీ..!!

జీ20 సదస్సు కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బదులుగా… అందులో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. ఈ ఆహ్వన పత్రికతోపాటు జీ20కి సంబంధించిన అన్నింటా భారత్ పేరును ప్రముఖంగా పేర్కొనడంపై రాజకీయంగా వివాదం చెలరేగింది.

Latest News

More Articles