Friday, May 17, 2024

మంచులో కూరుకుపోయిన అమెరికా.. వేల విమానాలు ర‌ద్దు

spot_img

అమెరికా పై మంచు దుప్ప‌టి క‌మ్మేసింది. శీతాకాల‌పు తుఫాన్ ప్ర‌భావంతో ఆమెరికా వ్యాప్తంగా తీవ్ర మంచు అలుముకుంది. దీంతో ప్ర‌జాజీవ‌నం స్తంభించిపోయింది. అలాగే ర‌వాణ వ్య‌వ‌స్థ కార్య‌కాపాలాలు ఆగిపోయాయి. ముఖ్యంగా మిడ్వెస్ట్, చుట్టు పక్కల రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి.

అమెరికా వ్యాప్తంగా ఏకంగా 2058 విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరో 5846 ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘ఫ్లైట్అవేర్.కామ్’ డేటా స్పష్టం చేసింది. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో చిక్కుకుపోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. చికాగోలోని హేర్ అంతర్జాతీయ విమానాశ్రయం 40 శాతం విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇక చికాగో మిడ్వే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి వెళ్లాల్సిన, ఇక్కడికి రావాల్సిన 60 శాతం విమాన సర్వీసులు రద్దయ్యాయి. డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మిల్వాకీ మిచెల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో పాటు పలు ఎయిర్పోర్టులు పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) మార్గదర్శకాలను దృష్టి పెట్టుకొని పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేయాల్సి వస్తోందని పలు ఎయిర్ పోర్టుల అధికారులు తెలిపారు.

Latest News

More Articles