Saturday, May 18, 2024

అమెరికాలో యూఎస్.. రిపబ్లికన్లకు అస్త్రంగా బైడెన్ వ్యాఖ్యలు.!

spot_img

కొన్ని సందర్బాల్లో మనం ఎక్కడున్నామో..ఏం చేస్తున్నామో మర్చిపోయి మాట్లాడుతుంటాం. కానీ రాజకీయనేతలు, ప్రముఖ వ్యక్తులు ఇలా మాట్లాడితే క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు కూడా ఇలాగే మాట్లాడుతూ అడ్డంగా బుక్కయ్యాడు. అమెరికాలో యూఎస్ అంటూ బైడెన్ చేసిన వ్యాఖ్యలకు రిపబ్లికన్లకు బూస్ట్ గామారాయి. ఆయన దేశం గురించి మర్చిపోయారంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ప్రముఖ సోషల్ నెట్ వర్క్ ట్విట్టర్ లోనూ షేర్ చేశారు.

నిత్యావసర ధరల కంటే వేగంగా వేతనాలు పెరుగుతున్నాయని..అమెరికాలోని యూఎస్ లో ఏ దేశంలో లేనంత తక్కువ ద్రవ్యోల్బణం ఉందంటూ బైడెన్ వ్యాఖ్యానించారు. దాన్ని మరింత తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. బుధవారం విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్ తన ప్రభుత్వ ఆర్థిక విధానాలను సమర్ధించుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పలువురు నెటిజన్లు బైడెన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఉత్తర అమెరికా ఖండంలో అనాల్సింది అమెరికా అని ఉంటారంటూ సమర్థిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఈ ఆకు రసం తాగితే..మలబద్ధకంతోపాటు అనేక వ్యాధులు పరార్..!

Latest News

More Articles