Friday, May 17, 2024

యెమెన్‌పై అమెరికా దాడులు.. ఎర్రసముద్రంలో ఉద్రిక్తత!

spot_img

న్యూఢిల్లీ: యెమెన్‌లో గురువారం 16 ప్రాంతాల్లో 60 లక్ష్యాలపై అమెరికా సంకీర్ణ దళాలు దాడులు చేశాయి. వీటిల్లో హౌతీ కమాండ్‌ సెంటర్లు, ఆయుధ డిపోలు, లాంచింగ్‌ వాహనాలు, ఉత్పత్తి కేంద్రాలు, ఎయిర్‌ డిఫెన్స్‌ రాడార్‌ వ్యవస్థలు ఉన్నాయని అమెరికా తెలిపింది. ఈ దాడుల కోసం 100 గైడెడ్‌ ఆయుధాలు ఉపయోగించినట్లు లెఫ్టినెంట్‌ జనరల్‌ అలెక్స్‌ గ్రెంక్విచ్‌ తెలిపారు.

Also Read.. ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్…రిలయన్స్ లో భారీగా ఉద్యోగాలు..ఇలా అప్లయ్ చేసుకోండి..!!

మరోవైపు ఈ దాడులపై హౌతీ నాయకుడు మహమ్మద్‌ అల్‌-బుఖైతీ స్పందించారు. యెమెన్‌పై చేసిన దాడులు మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. అమెరికా, యూకే త్వరలోనే భారీ ముల్యం చెల్లించుకుంటాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలపై దాడులను ఆపేదే లేదని హౌతీ మంత్రి హుస్సేన్‌ అల్‌ ఎజ్జి ప్రకటించారు.

Also Read.. కొత్త ఏడాదిలో అద‌ర‌గొట్టిన సుమిత్.. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌కు అర్హత

ఎర్రసముద్రంలోని అంతర్జాతీయ నౌకా మార్గంలో వెళ్లే నౌకలపై ఇటీవల హౌతీలు వరుసగా దాడులు చేయడం వివాదానికి కారణమైంది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, బహ్రెయిన్‌, కెనడా, డెన్మార్క్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌, దక్షిణ కొరియా, యూకే, అమెరికా దేశాలు సంకీర్ణ కూటమిగా ఏర్పడ్డాయి. ఎర్ర సముద్రంలో శాంతి నెలకొల్పడమే తమ ఉద్దేశమని అవి వెల్లడించాయి.

Latest News

More Articles