Friday, May 3, 2024

కాళేశ్వరంపై విచారణ చేసుకోండి.. కానీ రైతులను ఆదుకోండి  

spot_img

హైదరాబాద్: దేశంలోగానీ రాష్ట్రంలో గానీ ఆహార ధాన్యాల కొరత లేకుండా చేయాలంటే సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఆహార ధాన్యాల కొరత లేకుండా చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టిందని తెలిపారు. ఏటా వృధాగా పోతున్న వందలాది టీఎంసీ ల నీటిని సద్వినియోగం చేసుకునేందుకు గోదావరికి అడ్డంగా ప్రాజెక్టులు కట్టామని పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Also Read.. ఓటమి స్పీడ్‌ బ్రేకర్‌ లాంటిదే.. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుతాం

‘‘30 లక్షల టన్నుల వరిధాన్యం ఉత్పత్తి 2 కోట్ల టన్నులకు పెరిగింది. అన్నీ వనరులు సద్వినియోగం చేసుకుని పంట దిగుబడి పెంచాం. అనేక ప్రాజెక్టుల కింద రెండో పంట పడుతుంది అంటే అది కేసీఆర్ దూరదృష్టి ఫలితమే. ఈ ప్రభుత్వానికి ఆరోపణలు చేయడం తప్ప ఆలోచన లేదు. కాళేశ్వరంపై విచారణ చేసుకోండి..కానీ మిగతా సాగునీటి ప్రాజెక్టుల నీటి విడుదల మీద కూడా ఫోకస్ పెట్టండి.

Also Read.. తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం

సాగు నీటి ప్రాజెక్టుల కింద సకాలంలో నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. వరి దిగుబడి తగ్గకుండా చర్యలు తీసుకొండి. నీళ్లు ఉంచుకుని కూడా నీళ్లు ఇవ్వక పోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయి..వాడుకోండి. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజి దాకా నీటిని వాడుకోవచ్చు.

Also Read.. రామమందిరం ప్రాణప్రతిష్టకు ..ఆ సీఎంకు మాత్రమే ఆహ్వానం..దేశంలో ఏ సీఎంకూ అందని ఆహ్వానం..!!

మహారాష్ట్ర కోయినా ప్రాజెక్టు నుంచి 30 టీఎంసీ నీరు తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించడం అనాలోచిత చర్య. కోయినా డ్యామ్ మనకు 1300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రాజెక్టు నుంచి నీరు తీసుకొవడమంటే కాలంతో పాటు నీరు వృధా అవుతుంది. 30 టీఎంసీ ల నీళ్లు అక్కడ్నుంచి వదిలితే ఇక్కడికి వచ్చేసరికి 15 టీఎంసీ లు కూడా రాదు. రేపు వరి దిగుబడి తగ్గితే దానికి కాంగ్రెస్ ప్రభుత్వమే భాద్యత వహించాలి. మిడ్ మానేరు నీటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి.’’ అని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన సూచించారు.

Latest News

More Articles